ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్యాన పంటల సాగును పరిశీలించిన శిక్షణ ఐఏఎస్​ - etv bharat latest updates

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లి సమీపంలోని ఉద్యానపంటల సాగు విధానాలను ఉద్యాన అధికారులతో కలిసి శిక్షణ ఐఏఎస్ అధికారి​ అభిషేక్​ పరిశీలించారు. పంటలసాగుకు ఉపయోగించే వివిధ రకాల ఆటోమేటెడ్​ యంత్రాల వివరాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.

Training IAS examining the cultivation of horticultural crops at prakasam
ఉద్యాన పంటల సాగును పరిశీలించిన శిక్షణ ఐఏఎస్​

By

Published : Jul 14, 2020, 9:51 AM IST

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లి దండుదొవ దగ్గర ఉన్న ఉద్యానపంటలు, సాగు విధానాలను ఉద్యాన అధికారులతో కలిసి శిక్షణ ఐఏఎస్​ పరిశీలించారు. దందా వీరాంజనేయులు క్షేత్రంలో సాగవుతున్న భిన్నరకాల పంటలు, సాగు విధానాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఉద్యానసాగుకు పెద్దపీటవేస్తూ... సాగురైతులకు భారీగా రాయితీ పథకాలను అందిస్తోందని శిక్షణ ఐఏఎస్​ అధికారి అభిషేక్​ తెలిపారు. మిరప, కూరగాయలను నాటే ఆటోమేటిక్​ యంత్రాన్ని, పచ్చ అట్టలు తయారీ పరిశ్రమ, కూరగాయలను భద్రపరచే మినీ సోలార్​ శీతలగోదాము, ఇజ్రాయెల్​ టెక్నాలజీతో ఏర్పాటుచేసిన షెడ్​నెట్​లను పరిశీలించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన ఏడీ నాగరాజు, ఏపీడీ జనమ్మ, రైతులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details