వినియోగదారులకు అవగాహన కల్పించడంలో భాగంగా.. ప్రకాశం జిల్లా ఒంగోలులో భారత టెలికాం నియంత్రణ సంస్థ ప్రత్యేక సదస్సు నిర్వహించింది. టెలికాం రంగానికి సంబంధించిన పలు అంశాలను వివరించింది. పాలసీలో మార్పులు తీసుకురాబోతున్నట్టు చెప్పింది. ఈ సందర్భంగా.. టెలికాంవినియోగదారులు తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడంతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ట్రాయ్ ప్రతినిధులకు వివరించారు. ఈ విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ట్రాయ్ సిబ్బంది చెప్పారు.
పాలసీలో కొత్త మార్పులు తీసుకొస్తాం: ట్రాయ్ - TRAI awereness program
ట్రాయ్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో వినియోగదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సందేహాలు నివృత్తి చేశారు.
TRAI awereness program about consumers doubts at prakasham district