ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం సీతానాగులవరం సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. పొలంలో ఉప్పు శనగ పంట కోసేందుకు వెళ్తూ ట్రాక్టర్ వెనుక ఉన్న కోత యంత్రం ఓ పక్కకు ఒరిగి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వెంకటరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం సమయంలో మిల్లర్పై ఏడుగురు ఉండగా, వారిలో ఆరుగురు అప్రమత్తమై పక్కకు దూకేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆవుల వెంకటేశ్వర్లు తెలిపారు.
సీతానాగులవరంలో ట్రాక్టర్ బోల్తా...ఒకరి మృతి - tractor accident
ప్రకాశం జిల్లా సీతానాగులవరంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తన్నారు.
ట్రాక్టర్ బోల్తా...ఒకరి మృతి
ఇదీ చూడండి:పర్చూరు ఎమ్మెల్యేకు జాతీయ అవార్డు