Road Accident: ప్రకాశం జిల్లాలో లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి - ap news
10:10 December 08
తిరుపతి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం
ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం చేవూరు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు, యజమాని శ్రీనివాస చారి (58)లు అక్కడికక్కడే మృతి చెందారు. వెనక వైపు కూర్చొని ఉన్న.. రాజ్యలక్ష్మి (55) అనే మహిళకు తీవ్రగాయాలు కావడంతో కావలి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. మృతులు గుడివాడ సమీపంలో మిట్టకూరు ప్రాంతవాసులుగా గుర్తించారు. తిరుపతి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కారు బోల్తా..
నెల్లూరు జిల్లా గూడూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిశంకర కళాశాల వద్ద కారు బోల్తా పడింది. ఈ ప్రమాదం నుంచి నలుగురు స్వల్పగాయాలతో బయటపడ్డారు.