ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొగారు రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం - tobacco farmers registration latest news

ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 2020-21 సీజన్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అక్టోబర్‌ మూడో వారం వరకే గడువు ఉండటంతో రైతులు అన్ని పత్రాలతో పొగాకు బోర్డు అధికారుల దగ్గరకు వెళ్తున్నారు.

tobacco farmers registration
tobacco farmers registration

By

Published : Sep 29, 2020, 8:58 AM IST

ప్రకాశం జిల్లాలో పొగాకు రైతుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ సోమవారం ప్రారంభం అయ్యింది. జిల్లాలో ఉన్న 27 వేల మంది పొగాకు రైతులు రిజిస్ట్రేషన్‌ చేయించుకోడానికి ఆయా వేలం కేంద్రాలకు వెళుతున్నారు. 2020-21 సంవత్సరం సీజన్‌కు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి అక్టోబర్‌ మూడో వారం వరకే గడువు ఉండటంతో రైతులు అన్ని పత్రాలతో పొగాకు బోర్డు అధికారుల దగ్గరకు వెళ్తున్నారు.

జిల్లాలో దాదాపు 24వేల పొగాకు బ్యారన్లు ఉన్నాయి. ఒక్కో బ్యారన్‌కు 5 ఎకరాల విస్తీర్ణం సాగు చేయడానికి అనుమతి ఉంటుంది. అంతకు మించి చేయమని, బ్యారన్లు చుట్టూ 10 చెట్లను నాటుతామని హామీ ఇస్తూ ధరఖాస్తు చేసుకుంటున్నారు రైతులు. కొందరైతే ఇప్పటికే చెట్లు నాటి... వాటి ఫోటోలను జత చేస్తున్నారు. పొగాకు బోర్డులో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న రైతులకే బ్యాంకు రుణాలు, ఫ్లాట్‌ ఫారం వేలంలో పాల్గొనేందుకు అర్హత లభిస్తుంది. అలాగే బోర్డు పాసు పుస్తకం మంజూరు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details