ప్రకాశం జిల్లా కనిగిరిలో స్థానిక పొగాకు బోర్డు వేలంలో సరైన గిట్టుబాటు ధరలు లభించకపోవడం వల్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బయ్యర్లు, బోర్డ్ సిబ్బంది కుమ్మక్కయ్యారంటూ వాపోయారు. అందువల్ల తీవ్ర నష్టాలను చవిచూస్తున్నామంటూ ఆవేదన తెలిపారు. పొగాకు బోర్డు సమీపంలో గల జాతీయ రహదారిపై తమ ట్రాక్టర్లను రహదారికి అడ్డుగా పెట్టి, తమ పొగాకు బేల్లను తగలపెట్టి నిరసన చేపట్టారు. అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి అడ్డుపెట్టి ట్రాక్టర్లను తొలగించారు.
గిట్టుబాటు ధర లభించలేదని పొగాకు రైతుల ఆందోళన - కనిగిరి తాజా వార్తలు
సరైన గిట్టుబాటు ధర లభించడం లేదని పొగాకు రైతులు ఆగ్రహించారు. సమీప రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. పూర్తి స్థాయిలో బయ్యర్లు పాల్గొనకుండా బోర్డు సిబ్బంది, బయ్యర్లు ఒక్కటయ్యారని ఆరోపించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని అదుపు చేశారు.

తమకు అన్యాయం జరిగిందంటూ రహదారిపై పొగాకు రైతుల ఆందోళన