ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొగాకు రైతుల రాస్తోరోకో.. గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్ - farmers demanding for reasonable price

ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని నిరసన చేపట్టారు. ప్రధాన రహదారిమీద రాస్తోరోకో నిర్వహించారు. పొగాకు బోర్డ్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

praksam district
పొగాకు రైతుల రాస్తోరోకో

By

Published : Jun 25, 2020, 11:02 PM IST

ప్రకాశం జిల్లాలో కొండెపి పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులు కొనుగోళ్లను అడ్డుకొని, తమ నిరసనను వ్యక్తం చేశారు. వేలంను అడ్డుకొని, కేంద్రంలో భైఠాయించారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఎఫ్1, ఎఫ్2 గ్రేడ్ రకాల మాత్రమే కొనుగోలు చేస్తూ, దిగువ రకం పొగకును కొనుగోళ్లు చేయడం లేదని, ఒక వేళ కొనుగోళ్లు చేసినా తక్కువ ధర చెల్లిస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. బయ్యర్లు కుమ్మకై ధర లేకుండా చేస్తున్నారని, బోర్డ్ అధికారులు కూడా చోద్యం చూస్తున్నారని రైతులు వాపోతున్నారు.

లాక్ డౌన్ కారణంగా కొనుగోళ్లు నిలిచిపోవటం వల్ల నాణ్యత కొంత తగ్గిందని, ఇదే అదునుగా తక్కువ ధర చెల్లిస్తున్నారంటూ వీరు విమర్శిస్తున్నారు. రైతుల ఆందోళనతో కొనుగోళ్ళు నిలిచిపోయాయి. అటుగా వస్తున్న కొండెపి తహసీల్దార్ సుజాతను అడ్డుకున్నారు. పొగాకు బోర్డ్ అధికారులతో ఆమె ఫోన్ లో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఇది చదవండివెలిగొండ ప్రాజెక్టుపై కలెక్టర్ సమీక్ష... నిర్వాసితుల నిరసన

ABOUT THE AUTHOR

...view details