ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలో కడియాల యాదయ్య ప్రభుత్వ పాఠశాలలో పొగాకు వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పొగాకుతో వచ్చే వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సిగరెట్, గుట్కా , ఖైనీలు వాడకం వల్ల క్యాన్సర్ బారిన పడతారని వైద్యురాలు త్రివేణి హెచ్చరించారు. విద్యార్థులు ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరికి తెలియజేయాలన్నారు. పొగాకు వాడకంతో చనిపోయిన వారిలో మొదటి 10 దేశాల్లో భారత్ కూడా ఉందన్నారు. పాఠశాల ఆవరణలో ధూమపానం, మద్యపానం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలన్నారు. ధూమపానం వల్ల జరిగే నష్టాలు గురించి విద్యార్థులకు నాటక రూపంలో చూపించారు.
'పొగాకు వాడకం క్యాన్సర్‌కి కారకం' - ongole
సమాజంలో ఎంతోమంది ప్రజలు పొగాకు వాడుతూ రోగాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా పొగాకు వాడకాన్ని తగ్గించుకుని ప్రాణాలు కాపాడుకోవాలంటున్నారు.. వైద్యులు.
అవగాహన సదస్సు