ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అడ్డంగా ఉందని నరికేశారు..అడ్డుగా పడేశారు

ప్రకాశంజిల్లా చీరాలో అధికారుల నిర్వాకం రైతులకు సంకటంగా మారింది. తోటవారిపాలెం ఎత్తిపోతల పథకం కాలువకు ఇరువైపులా పెరిగిన చెట్లును నరికేసి, వాటిని కాల్వలో పడేశారు.

పంటకాలువ సమస్యను పరిష్కారించాలని.. అన్నదాతలు

By

Published : Aug 31, 2019, 1:55 PM IST

పంటకాలువ సమస్యను పరిష్కారించాలని.. అన్నదాతల వినతి

కాల్వగట్టు మీద అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లను నరికి,కాల్వలోనే పడేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.అధికార్ల నిర్వాకంతో రైతులు లబోదిబోమంటున్నారు.ప్రకాశం జిల్లా చీరాలలో తోటవారిపాలెం ఎత్తిపోతల పథకం పంటకాలువకు ఇరువైపులా చిల్ల చెట్లు భారీగా పెరిగాయి.దీంతో నీటి ప్రవాహానికి ఇబ్బంది కలుగుతోంది.రంగంలోకి దిగిన అధికార్లు,జంగిల్ క్లియరెన్స్ పేరుతో చెట్లను యుద్దప్రాతిపదికన తొలగించారు.తొలగించిన ఆ చెట్లను ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక,తిరిగి వాటిని కాలువలోనే పడేసి వెళ్లిపోయారు.దీంతో పంట కాల్వ పూర్తిగా మూసుకుపోయి,నీటి ప్రవాహం ఆగిపోయింది.పంటలకు ఇప్పుడిప్పుడే సాగునీరొస్తున్న సమయంలో అధికార్లు చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ పై రైతులు గగ్గోలు పెడుతున్నారు.అధికారులు తక్షణమే స్పందించి కాలువ పూడిక తీయాలని రైతులు వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details