Tiger: ప్రకాశం జిల్లా పెద్దబొమ్మలాపురం గండి చెరువు సమీపంలో సంచరించే పెద్దపులి కదలికలపై సిబ్బంది నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని రేంజర్ విశ్వేశ్వరరావు తెలిపారు. గత నెలలో మూడు సార్లు, ఈ నెల 5న పెద్దపులి సంచరించింది. అటవీ సిబ్బంది పాదముద్రలు సేకరించారు. పులితో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో గురువారం ఆయన పరిశీలించారు. పులి సంచరించిన రహదారిలో కెమెరా ట్రాపును బిగించారు. పెద్దబొమ్మలాపురం, కొలుకుల బీట్ల సమీపంలో సంచారం సాధారణమేనన్నారు. నీటి కోసం చెరువు వద్దకు వచ్చి వెళ్లిపోతుందని, ఇబ్బంది ఉండదని తెలిపారు.
Tiger wandering: ప్రకాశం జిల్లాలో పెద్దపులి సంచారం.. - ప్రకాశం జిల్లాలో పెద్దబొమ్మలాపురం గండి చెరువు సమీపంలో పెద్దపులి సంచారం
Tiger: ప్రకాశం జిల్లా పెద్దబొమ్మలాపురం గండి చెరువు సమీపంలో సంచరించే పెద్దపులి కదలికపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని.. అటవీ శాఖ అధికారులు తెలిపారు. పులి సంచరించిన మార్గంలో అటవీ అధికారులు కెమెరాను బిగించారు.
ప్రకాశం జిల్లాలో పెద్దపులి సంచారం
నీటి కోసం పులి చెరువు వద్దకు వచ్చిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు పులితో ఎలాంటి ప్రమాదం లేదని.. పులి కదలికపై సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు.
ఇవీ చూడండి: