ప్రకాశం జిల్లాలో పిడుగులు.. విపత్తుల శాఖ హెచ్చరిక - ప్రకాశం జిల్లాలో పిడుగులు పడే అవకాశం వార్తలు

17:38 April 19
ప్రకాశం జిల్లాలోని పలు మండలాలకు విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది.
ప్రకాశం జిల్లాలోని పలు మండలాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పొదిలి, కొనకనమిట్ల, కనిగిరి, మర్రిపూడి, బెస్తవారిపేట, అర్ధవీడ, పెద్దరావీడు, తర్లుపాడు, హనుమంతునిపాడు మండలాల్లో పిడుగులు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది. పొలాల్లోని పనివారు, కాపరులకు అప్రమత్తంగా ఉండాలని విపత్తల శాఖ పేర్కొంది. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించింది.
ఇదీ చదవండి:జగనన్న విద్యా దీవెన ప్రారంభం.. తల్లుల ఖాతాల్లోకే నగదు!
TAGGED:
thunders effect in ap news