ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Kanigiri కళ్లలో కారం కొట్టి రూ. 3.5 లక్షల దోపిడి - 3 లక్షలు దోచుకున్నారు దుండగులు

Thugs stole 3 lakhs ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్య భర్తల కళ్లలో కారం కొట్టి రూ. 3లక్షల 50వేల రూపాయలను అపహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసుకుని వెళ్తోన్న దంపతులపై దాడి చేసి డబ్బును దోచుకున్నారు.

Road robbery in Kanigiri
కళ్లలో కారం కొట్టి రూ. 3.5 లక్షలు చోరీ

By

Published : Sep 4, 2022, 10:00 AM IST

Updated : Sep 4, 2022, 10:14 AM IST

Road robbery in Kanigiri ప్రకాశం జిల్లా కనిగిరిలో పట్టపగలే దారిదోపిడి జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్య భర్తల కళ్లలో కారం కొట్టి 3లక్షల 50వేల రూపాయల నగదు అపహరించారు కొందరు యవకులు. కనిగిరి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన నామాల వెంకటస్వామి, అదెమ్మ దంపతులు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో మూడున్నర లక్షల రూపాయలు డ్రా చేశారు. దీనిని గమనించిన దుండగులు వారిని వెంబడించారు. పొనుగోడుకు వెళ్లే మార్గంలో గార్లపేట వద్ద కళ్లల్లో కారంకొట్టి వారి వద్ద ఉన్న డబ్బును దోచుకున్నారు. ఆందోళనకు గురైన దంపతులు పోలీసులను ఆశ్రయింరు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Last Updated : Sep 4, 2022, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details