Nandi statue destroyed with Country Made Bombs: గుప్తనిధుల కోసం పురాతన శివాలయంలో దుండగులు చేసిన చోరీ విఫలయత్నమైంది. ప్రకాశం జిల్లా నాగులపాడు మండలంలో కనపర్తి గ్రామంలో పురాతన శివాలయంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక దుండగులు నంది విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. పేలుడు పదార్థాలు పెట్టి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహాన్ని పూర్తిగా పెకిలించే ప్రయత్నం చేసినా వీలు కాలేదు. రెండు కార్లలో వచ్చి దుండగులు ఈ చోరీ ప్రయత్నం చేశారని స్థానికులు చెబుతున్నారు. నంది బొమ్మ దిగువున గుప్త నిధులు ఉన్నాయని ప్రచారం ఉండటంతో ఈ చోరీ ప్రయత్నం జరిగిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
Statue destroyed: గుప్త నిధుల కోసం నంది విగ్రహం ధ్వంసం... ఎక్కడంటే? - ఏపీ తాజా వార్తలు
Nandi statue destroyed with Country Made Bombs: ప్రకాశం జిల్లాలోని ఓ శివాలయంలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. గుప్తనిధుల కోసం నంది విగ్రహాన్ని నాటుబాంబులు పెట్టి ధ్వంసం చేశారు. అసలేం జరిగిందంటే..?
గుప్త నిధుల కోసం విగ్రహం ధ్వంసం