ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. చినగంజాం నుంచి చేపలు అమ్ముకునే 14 మంది మహిళలు ఆటోలో ఒంగోలు బయల్దేరారు. నాగులుప్పలపాడులోని రైతుబంధు శీతల గోదాము వద్దకు వచ్చేసరికి ఆటో... ఆగి ఉన్న లారీని వెనకనుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో పూర్తిగా ధ్వంసం కాగా.. 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. అక్క నాగమ్మ అనే మహిళను ఒంగోలు రిమ్స్‌కు తరలిస్తుండగా చనిపోయింది. గోవిందమ్మ, చెంచమ్మల పరిస్థితి విషమంగా ఉండటంతో... వారిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఆరుగురు క్షతగాత్రులు ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.
లారీని ఢీకొన్న ఆటో..ముగ్గురు మహిళలు మృతి - road accident latest news in prakasam
ఆగిఉన్న లారీని వెనుకనుంచి ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో ఈ ప్రమాదం జరిగింది.
three-women-died-in-road-accident