ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులు వెంటాడారు.. కాల్వలో పడి చనిపోయారు - చీరాలలో కోడిపందేల స్థావరాలపై పోలీసుల దాడి వార్తలు

కోడి పందేల నిర్వహణ ఇద్దరి ప్రాణాలు తీసింది. పందేల స్థావరాలపై పోలీసులు దాడిచేయగా.. పారిపోబోయిన ముగ్గురు వ్యక్తులు కాల్వలో పడ్డారు. ఇద్దరు మృతిచెందగా మరొకరి కోసం గాలిస్తున్నారు.

చీరాలలో కోడిపందేల స్థావరాలపై పోలీసుల దాడి

By

Published : Oct 30, 2019, 11:12 AM IST

Updated : Oct 30, 2019, 10:13 PM IST

ప్రకాశం జిల్లా చీరాల మండలం విజయనగర్ కాలనీలో కోడిపందేల స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. వారిని చూసి పారిపోయే క్రమంలో కాలువలో పడి ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఎం. మధు, సీహెచ్. శ్రీనుతో పాటు మరో యువకుడు కాల్వలో పడిపోయారు. మధు, శ్రీను మృతదేహాలను స్థానికులు బయటకు తీశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

చీరాలలో కాల్వలో పడి ముగ్గురు వ్యక్తులు మృతి

ఎం. మధు, శ్రీను మృతదేహాలను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేశారు. ఆసుపత్రికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు రోదనలు అందర్నీ కలచి వేశాయి. వారి పిల్లల బేలచూపులు చూసినోళ్ల కంట నీరు ఉబికి వచ్చింది. పోలీసులు భయబ్రాంతులకు గురిచేయటమే తమ వాళ్లు కాలువలోకి దూకి ప్రాణాలు కోల్పోయారని కుటుంబసభ్యులు ఆరోపించారు.

చీరాలలో కాల్వలో పడి ముగ్గురు వ్యక్తులు మృతి
Last Updated : Oct 30, 2019, 10:13 PM IST

ABOUT THE AUTHOR

...view details