క్రిస్మస్ షాపింగ్‌కు బయలుదేరిన ముగ్గురు స్నేహితులు... రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. బల్లికురవ మండలం వెలమవారిపాలెంకు చెందిన చిట్లూరి ఏసయ్య, చిట్లూరి మాతయ్య, కోటయ్య... బైక్‌పై షాపింగ్‌కు బయలుదేరారు. మద్దిపాడు మండలం ఏడుగండ్లుపాడు వద్ద... ముందువెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. ఏసయ్య, మాతయ్యలకు గత ఏడాదే వివాహమైంది. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు కావటంతో... స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - Prakasam district latest news
ప్రకాశం జిల్లాలో విషాద ఘటన జరిగింది. క్రిస్మస్ షాపింగ్‌కు బయలుదేరిన ముగ్గురు స్నేహితులు... రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. మద్దిపాడు మండలం ఏడుగండ్లుపాడు వద్ద... ముందువెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి