ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అద్దంకి రోడ్డులో ప్రమాదం.. ముగ్గురికి గాయాలు - ప్రకాశం జిల్లా అద్దంకి తాజా వార్తలు

ప్రకాశం జిల్లా దర్శిలోని అద్దంకి రోడ్డులో ప్రమాదం జరిగింది. షిరిడిసాయి అపార్ట్​మెంట్ వద్ద ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొంది. ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

accident
accident

By

Published : May 26, 2021, 4:23 PM IST


ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డులోని షిరిడి సాయి అపార్ట్​మెంట్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. అద్దంకి రోడ్డులో ఓ వ్యక్తి తన కుటుంబసభ్యులతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. అటుగా వస్తున్న ఓ కారు వారిని ఢీకొట్టింది.

ముండ్లమూరు మండలం కెల్లంపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు కుటుంబ సభ్యులతో దర్శి వచ్చి తిరుగుపయనమయ్యే సమయంలో ఘటన చోటు చేసుకుంది. రామాంజనేయులు అతని భార్యకు తీవ్ర గాయాలుకాగా.. కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details