కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న క్రమంలో ప్రకాశం జిల్లా మార్కాపురంలో అధికారులు పూర్తి లాక్డౌన్ విధించారు. ఇప్పటివరకూ 96 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 10 రోజుల వ్యవధిలో వైరస్‌తో నలుగురు మృతిచెందారు.
ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు ఇంటికే తెచ్చి ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా అనవసరంగా బయటకు వస్తే క్వారంటైన్ కేంద్రాలకు పంపుతామని హెచ్చరించారు.