ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రకాశంలో 3 కరోనా కేసులు.. అప్రమత్తమైన అధికారులు - ఇండియాలో కరోనా కేసులు తాజా వార్తలు

ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్​ కేసులు నమోదు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నివారణ చర్యలపై రెవెన్యూ, మున్సిపల్, పొలీస్, వైద్యశాఖాధికారులతో కలెక్టర్ పోలా భాస్కర్ సమావేశం నిర్వహించారు.

Three Covid-19 Positive Cases in prakasham
అధికారులతో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సమావేశం

By

Published : Mar 29, 2020, 7:57 AM IST

అధికారులతో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సమావేశం

ప్రకాశం జిల్లాలో మూడు కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. చీరాలలో ఇద్దరికి, ఒంగోలులో ఒక కేసు నిర్ధారణ కావడంతో మొత్తం జిల్లాలో మూడు కొవిడ్-19 కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు. కేసులు నమోదైన ప్రాంతం నుంచి 300 మీటర్లు హై సెన్సిటివ్ జోన్​గా, మూడు కిలోమీట్లర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. చీరాల, వేటపాలెం మండల ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details