ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే: నారా లోకేశ్

ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి 13 మంది మృతి చెందిన ఘటనపై నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అస్తవ్యస్త మద్యం పాలసీ, విషం లాంటి బ్రాండ్ల అమ్మకం.. ప్రజలు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని విమర్శించారు. మృతుల కుటుంబాలకు 50 ల‌క్షల రూపాయలు చొప్పున న‌ష్టప‌రిహారం చెల్లించాల‌ని డిమాండ్‌ చేశారు.

nara lokesh
nara lokesh

By

Published : Jul 31, 2020, 6:04 PM IST

జే ట్యాక్స్ వసూళ్లకు కక్కుర్తి పడి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ప్రకాశం జిల్లా కురిచేడు, పామూరులో శానిటైజర్ తాగి 13 ప‌ది మంది చ‌నిపోవ‌డం అత్యంత విషాద‌కరమ‌ని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ముమ్మూటికీ జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు హ‌త్యలేన‌ని లోకేశ్ ఆరోపించారు.

ప్రభుత్వ అస్తవ్యస్త మద్యం పాలసీ, విషం లాంటి బ్రాండ్లు ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. మ‌ద్య నిషేధం ముసుగులో 'జే ట్యాక్స్' వసూళ్ల కోసం విషం లాంటి బ్రాండ్లు 300 శాతం అధిక ధరలకు అమ్మడం జ‌గ‌న్ ‌రెడ్డికే చెల్లింది. మ‌ద్యానికి బానిసైన నిరుపేద‌లు ఇలా సారా, శానిటైజర్లు తాగి మృత్యువాత ప‌డుతున్నారు. ఈ మరణాలు ముమ్మూటికీ జ‌గ‌న్‌రెడ్డి సర్కారు హత్యలే. శానిటైజ‌ర్ తాగి కురిచేడు, పామూరులో చ‌నిపోయిన ఒక్కొక్కరి కుటుంబానికి 50 ల‌క్షల రూపాయలు ప‌రిహారం చెల్లించాలి. వైకాపా లిక్కర్ మాఫియా అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి- నారా లోకేశ్

విచారణ జరిపించాలి

కురిచేడు ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నకిలీ మద్యం తాగే వారు మృతి చెంది ఉంటారన్న అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యం, సారా ఏరులై పారుతోందని.. అధికార పక్ష నేతల కనుసన్నల్లో ఈ దందా సాగుతుందని యరపతినేని ఆరోపించారు.

ఇదీ చదవండి

మద్యం దొరక్క శానిటైజర్​ సేవించి 13 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details