ఇళ్లలో చార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్లు, తాళం వేసి ఉన్న ఇళ్లలో ఎలక్ట్రానిక్ వస్తువులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ప్రకాశం జిల్లా చీరాల రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిని చీరాల పట్టణానికి చెందిన మేడం నీలాంబరం, అంబుద్ధ వినయ్ కుమార్ గా గుర్తించారు. ఎనిమిది చరవాణిలు, ఎల్ఈడీ టీవీ, లాప్ ట్యాప్, 2 వెండి గిన్నెలు కలిపి మొత్తం ఒక లక్ష డెబ్భై వేల రూపాయలు విలువచేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారని చీరాల డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
ఎలక్ట్రానిక్ వస్తువులే లక్ష్యంగా దోపిడీ.. ఇద్దరి అరెస్ట్ - చీరాల
ఇళ్లలో చార్జింగ్ పెట్టి ఉన్న చరవాణులను గుట్టు చప్పుడు కాకుండా దోచేస్తున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లలో ఎలక్ట్రానిక్ పరికరాలను చాకచక్యంగా ఎత్తుకెళ్లారు. ఇలాంటి మరెన్నో దోపిడీలకు ప్లాన్ చేశారు. చివరికి.. పోలీసుల ఉచ్చులో చిక్కి.. జైలుపాలయ్యారు.
ఎలక్ట్రానిక్ వస్తువులే లక్ష్యంగా..ఇళ్లను దోచేస్తున్న నయా దొంగలు