ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దొంగలు అరెస్టు.. 51గ్రాముల బంగారం స్వాధీనం - darshi dsp prakashrao

ప్రకాశం జిల్లాలో ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 51గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

thieves-arrest-in-prakasam-district
దొంగతనానికి పాల్పడిన నిందితుల అరెస్టు

By

Published : Feb 28, 2020, 7:23 PM IST

Updated : Feb 28, 2020, 7:28 PM IST

దొంగతనానికి పాల్పడిన నిందితుల అరెస్టు

ప్రకాశం జిల్లా కోరిశపాడు మండలం రావినూతల గ్రామంలో ఈ నెల పదమూడో తేదీన ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన నిందితులను స్థానిక ఎస్సై శివ నాంచారయ్య అరెస్ట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను అరెస్టు చేశామని దర్శి డీఎస్పీ ప్రకాశ్​రావు తెలిపారు. నిందితులను తాడేపల్లి మండల వాసులుగా గుర్తించారు. వీరిపై గతంలో ఆయా పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులు నమోదయ్యాయని తెలియజేశారు. నిందితుల వద్ద నుంచి 51 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Last Updated : Feb 28, 2020, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details