ప్రకాశం జిల్లా అద్దంకి - నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై తరచూ దొంగతనాలకు పాల్పడే ముఠాను.. అద్దంకి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహదారిపై లారీ డ్రైవర్లను బెదిరించి డబ్బులు దండుకోవడం, పట్టణ శివారు ప్రాంతాల్లోని గృహాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న 8 మంది ముఠా సభ్యులను పట్టుకున్నారు. ఇంటర్, పదో తరగతి ఫెయిల్ అయిన మైనర్ విద్యార్థులు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ ప్రకాష్‌రావు తెలిపారు.
దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు - prakasham district latest news
అద్దంకి - నార్కట్‌పల్లి ప్రధాన రహదారిపై తరచూ దొంగతనాలకు పాల్పడే ముఠాను.. అద్దంకి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని అద్దంకి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ ప్రకాష్‌రావు తెలిపారు.
దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు