ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్.. బంగారం, నగదు స్వాధీనం - prakasham latest news

ఆరు బయట నిద్రిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి పెద్దమొత్తంలో సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

prakasham dis
దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్.. బంగారం, నగదు స్వాధీనం

By

Published : Mar 7, 2021, 8:07 AM IST

దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు చీరాల పోలీసులు చెప్పారు. అతని నుంచి నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండలంలో బండారు నాగేశ్వరరావు కాలనీలో జనవరిలో రూ. 1.50 లక్షలు నగదు, బంగారం, వెండి వస్తువుల చోరీ జరిగింది. ఇందిరానగర్ కాలనీలో అనీల్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బంగారం, రూ.70 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు పిర్యాదు చేశారు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదినారాయణపురానికి చెందిన ఎస్.బాలరాజును అరెస్టు చేశారు. నిందితుడి నుంచి బంగారు ఆభరణాలు, కిలో వెండి, రూ.70 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చీరాల రూరల్ సీఐ రోశయ్య తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details