ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెంలో... గాడిపర్తి రామాంజనేయులు అనే వ్యక్తి ఇంట్లో గతనెల 26న దొంగతనం జరిగింది. చోరీ చేసిన నిందితున్ని ఇవాళ సంతమాగులూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన రమేష్ నాయక్... చిన్నప్పటి నుంచి చెడు వ్యసనాలకు బానిసై ఈ దొంగతనం చేసినట్లు దర్శి డీఎస్పీ ప్రకాశ్‌రావు తెలిపారు.
చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్టు - దొంగను అదుపులోకి తీసుకున్న సంతమాగులూరు పోలీసులు
గతనెల 26న ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పరిధిలోని పుట్టావారిపాలెంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నిందితుని నుంచి రూ.3లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

దొంగతనం కేసును ఛేదించిన సంతమాగులూరు పోలీసులు