ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాళం వేసిన ఇళ్లను లూటీ చేసే దొంగ అరెస్ట్ - మార్టురులో దొంగ అరెస్ట్

ప్రకాశం జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతడిని ఎర్రబోలుకు చెందిన గోపిగా గుర్తించారు. నిందితుడిపై గతంలోనూ పలు కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.

theft arrest
theft arrest

By

Published : Jun 26, 2021, 12:47 PM IST

తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని ప్రకాశం జిల్లా మార్టూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఎర్రబోలు గోపి అనే వ్యక్తి 2019లో మార్టూరులోని ఓ సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో పనిచేస్తూ.. సమీపంలోని తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు.

రూ.1.20 లక్షల విలువ చేసే ఆభరణాలు అపహరించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 13 వతేదీన మార్టూరు లోని ఓ ఇంట్లో రూ.3200 అపహరించాడు. రాజుపాలెం చెక్ పోస్టు వద్ద అనుమానస్పదంగా సంచరిస్తుండగా.. ఎస్.ఐ చోడయ్య అతణ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. చోరీ చేసినట్లు గోపి ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.1.33 లక్షల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details