Studies in Church: నాడు నేడు లాంటి పథకాలు ఎన్ని వస్తున్నా విద్యార్థుల తలరాతలు మాత్రం మారాడం లేదు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం గానుగపెంటలో పాఠశాల లేక చర్చిలో విద్యార్థుల చదువులు కొనసాగిస్తున్నారు. గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఓ కాలనీ ఏర్పడింది. ఎక్కువ గృహాలు నిర్మించుకోవడంతో విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. గతంలో తక్కువ మంది ఉండడంతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాథమిక పాఠశాలకు వెళ్లేవారు. ప్రధాన రహదారి కావడంతో స్కూల్కు వెళ్లే సమయంలో చిన్నారులకు పలు సార్లు రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయి. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య పెరగడంతో కాలనీ వాసులు పాఠశాల నిర్మించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండట్లేదని స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం 32 మంది విద్యార్థులు ఇద్దరి ఉపాధ్యాయినులతో చర్చిలోనే పాఠశాల కొనసాగుతోంది. చర్చిలో ఏమైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు తాము ఇళ్ళ వద్దే ఉండాలి వస్తుందని విద్యార్డులు తెలిపారు.
స్కూలు లేక కష్టాలు.. మారని తలరాతలు.. పట్టించుకోని అధికారులు..
Studies in Church: చదువుకునేందుకు పాఠశాల లేక చర్చిలోనే చదువు కొనసాగిస్తున్నారు. నాడు నేడు లాంటి పథకాలు వస్తున్నాయి కానీ విద్యార్థుల తలరాతలు మాత్రం మారాడం లేదు. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా ఫలితం ఉండట్లేదు.. గ్రామాన్ని పట్టించుకునే నాధుడు లేడని స్థానికులు వాపోతున్నారు.
There is no school to study but they study in church