మిన్నెకల్లు ఆలయంలో చోరీ - ప్రకాశం జిల్లా వార్తలు
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మిన్నెకల్లు త్రిపురా సుందరిదేవి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరికి పాల్పడ్డారు.
ఆలయంలో చోరీ... అంతా దొంగల పాలు!
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మిన్నెకల్లు త్రిపురా సుందరిదేవి ఆలయంలో చోరీ జరిగింది. గుడి తాళాలు, హుండీ తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. నగదు మొత్తాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటనపై గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.