ప్రకాశం జిల్లా కనిగిరిలోని కొత్తపేటలో ప్రభుత్వ ఉద్యోగి మారెళ్ళ చిరంజీవి ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలు బంగారు, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. రాత్రి బంధువుల ఇంటికి వెళ్లి.. ఉదయం వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. దీనిపై ఆయన పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కనిగిరిలో తాళం వేసిన ఇంట్లో దొంగతనం - theft in home at prakasham dist
ప్రకాశం జిల్లా కనిగిరిలో తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలు బంగారు, వెండి నగలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరి