ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

theft: రద్దీగా ఉన్న బస్సెక్కుతారు.. ఆ తర్వాత.. - ప్రకాశం జిల్లాలో బంగారం దొంగతనం వార్తలు

రద్దీగా ఉన్న బస్సు ఎక్కి ప్రయాణికులు ఎమరపాటుగా ఉన్నప్పుడు వారి బ్యాగులను కత్తిరించి చోరీలకు పాల్పడుతున్న ముఠాను ప్రకాశం జిల్లా (prakasam district)పోలీసులు అరెస్టు (theft gang arrest) చేశారు. నిందితుల నుంచి రూ.2.50 లక్షలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

దొంగల ముఠా అరెస్టు
దొంగల ముఠా అరెస్టు

By

Published : Nov 2, 2021, 8:09 PM IST

Updated : Nov 2, 2021, 10:09 PM IST

ప్రయాణికుల బ్యాగులను కత్తిరించి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను ప్రకాశం జిల్లా(prakasam district) పోలీసులు అరెస్టు (theft gang arrest)చేశారు. నిందితుల నుంచి రూ.2.50 లక్షలు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఏప్రిల్​లో చోరీ

ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇంకొల్లు ఫార్మసి కళాశాలలో పనిచేస్తున్న కళా ప్రవీణ్ కుటుంబ సభ్యులతో కలిసి​ విశాఖపట్నం వెళ్లేందుకు చీరాల నుంచి గుంటూరు వెళ్లే బస్సు ఎక్కారు. బస్సు రద్దీగా ఉండటంతో వీరితో బస్సు ఎక్కిన మరో ఇద్దరు మహిళలు కళా ప్రవీణ్​​కు చెందిన బ్యాగ్​ను కత్తిరించి .. 300 గ్రాముల బంగారాన్ని(gold theft) ఎత్తుకెళ్లారు. అనంతరం బ్యాగు చూసుకున్న బాధితులు చీరాల రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తాజాగా గుర్తింపు

తాజాగా చీరాల బైపాస్ రోడ్డులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో బంగారం అమ్మేందుకు వెళుతున్న ముగ్గురు వ్యక్తులను అనుమానంతో పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. వారిని పట్టుకుని దర్యాప్తు చేయగా ఇద్దరు మహిళలు ఇచ్చిన బంగారాన్ని అమ్మేందుకు తీసుకెళుతున్నట్లు తెలిపారని పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 73 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం కాళా ప్రవీణ్​కు చెందిందిగా గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందుతులు ఏడుకొండలు, నాగరాజు , వెంకటేశ్​లుగా గుర్తించామన్నారు. నిందితులకు బంగారాన్ని ఇచ్చిన మహిళలను కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు.

ఇదీ చదవండి:Attack: గంజాయి పంట ధ్వంసం చేసేందుకు వెళ్లిన పోలీసులపై గిరిజనుల దాడి

Last Updated : Nov 2, 2021, 10:09 PM IST

ABOUT THE AUTHOR

...view details