ప్రకాశంజిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లెలోని ఆలయాల్లో చోరీ జరిగింది. గ్రామంలోని శివాలయం, పోలేరమ్మ దేవాలయాల్లో ఒకేసారి దొంగతనం జరిగింది. తెల్లవారుజాము వరకు ఆలయంలో భక్తులు ప్రత్యేక కార్యక్రమాలు, భజనలు చేశారు. అనంతరం గుడి తలుపులు మూసివేసి వెళ్లిపోయారు.
మార్టూరు దేవాలయాల్లో చోరీ.. సీసీ కెమెరాలో దృశ్యాలు
ఆలయాల్లోని హుండీలను పగులగొట్టి సొమ్మును దోచుకెళ్లాడు ఓ దొంగ. భక్తులు వెళ్లిన కొద్దిసేపటికీ అతను ఈ చోరీకి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలన్ని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఆ సమయంలో ఓ దొంగ చోరీకి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలన్ని సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. అదే సమయంలో స్థానికంగా ఉండే పోలేరమ్మ దేవాలయంలో కూడా దుండగులు హుండీ ఎత్తుకెళ్లారు. అందులోని కానుకలను తీసుకెళ్లి.. హుండీని సమీపంలోని పొలాల్లో వదిలేశారు. సమాచారం అందుకున్న మార్టూరు ఎస్ఐ చౌడయ్య ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గత ఏడాది కూడా రెండు దేవాలయాల్లో ఇదే తరహాలో చోరీలు జరిగాయని గ్రామస్థులు తెలిపారు. పోలీసుల సూచన మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండీ..పురుషామృగ వాహనంపై శ్రీ సోమస్కంధమూర్తి