కరోనా కట్టడిలో పోలీసులు అలుపెరగకుండా శ్రమిస్తున్నారని ప్రకాశం జిల్లా చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి ప్రశంసించారు. లాక్డౌన్ విధించినప్పటినుంచి ప్రజాశ్రేయస్సు కోసం పాటుపడుతున్నారన్నారు. వేటపాలెం, చిన్నగంజాం, ఇంకొల్లు పోలీసు స్టేషన్ల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి ఆయన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ...వైరస్ నియంత్రణకు పోలీసులు శ్రమిస్తున్నారని డీఎస్పీ కొనియాడారు.
'కరోనా కట్టడిలో పోలీసుల శ్రమ ప్రశంసనీయం' - police Corona controlling is admirable
కరోనా పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ వైరస్ నియంత్రణకు పోలీసులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని ప్రకాశం జిల్లా చీరాల డీఎస్పీ జయరామసుబ్బారెడ్డి ప్రశంసించారు. పలు పోలీసు స్టేషన్ల పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి ఆయన నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
కరోనా కట్టడిలో పోలీసుల శ్రమ ప్రశంసనీయం