ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గార్లపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఐటీసీ గోదాంలో చౌక ధర బియ్యం నిల్వ ఉంచారు. చాలా కాలంగా అవి నిల్వ ఉండడంతో పురుగులు తయారవుతున్నాయి. ఫలితంగా ఇళ్లలోకి వచ్చి నరకం చూపిస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ... ఆందోళనకు దిగారు.
బాబోయ్ పురుగులు... కాపాడాలని రోడ్డెక్కిన ప్రజలు! - concern over the negligence
పురుగులు ఇళ్లలోకి చేరి... కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని ప్రజలు ఆందోళనకు దిగారు. ఐటీసీ గోదాంలో చౌక ధరల బియ్యం నిల్వ ఉంచడం ద్వారా పురుగులు తయారై తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

The villagers' concern over the negligence of the authorities