ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం ఆమోదగిరిపట్నంలో చోరీ జరిగింది. బండారు ప్రకాశరావు అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి ఊరెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. అనుమానంతో లోపలికెళ్లి చూస్తే.. బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలోని 16 సవర్ల బంగారు నగలు, రూ.5 లక్షల నగదును దుండగులు దోచుకెళ్లారని బాధితుడు వాపోయాడు.
ఊరెళ్లి తిరిగొచ్చేసరికి.. బీరువాలోని ఆభరణాలు, నగదు మాయం - ప్రకాశం జిల్లాలో దొంగతనం
వేటపాలెం మండలం ఆమోదగిరిపట్నంలో చోరీ జరిగింది. ఇంటి వాళ్లు ఊరెళ్లింది చూసి..16సవర్ల బంగారు నగలు,రూ.5లక్షల్ని దుండగులు దోచుకెళ్లారు.
దొంగతనం
వేటపాలెం పోలీసులకు బాధితుడు ప్రకాశరావు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న వేటపాలెం ఎస్.ఐ కమలాకర్.. సంఘటనాస్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:Bride Escape: కొద్ది గంటల్లో వివాహం...కానీ అంతలోనే..