గిద్దలూరులో కిక్కిరిసిన వీధులు - గిద్దలూరులో ప్రజల రద్దీ
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వీధులన్నీ రద్దీగా మారాయి. మెయిన్ బజార్, పొట్టి శ్రీరాములు సెంటర్, ఆంటీ హోటల్ వీధులన్నీ జనంతో కిటకిటలాడాయి. ట్రాఫిక్‌తో జనాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వస్త్ర, పాదరక్షలు, బంగారు దుకాణాలు జనాలతో కిక్కిరిశాయి.