ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు... బేస్తవారిపేట మండలం జంగంబోట్లకృష్ణాపురం వద్ద వరద నీటికి రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది. నిన్న రాత్రి వరకు ప్రవాహం తగ్గకపోవడంతో శుక్రవారం ఉదయం 150 మంది రైల్వే ఉద్యోగులు, కార్మికులు జేసీబీ యంత్రాల సహాయంతో ట్రాక్ పునరుద్ధరణ నిర్మాణ పనులు వేగవంతం చేశారు. పనులు శుక్రవారం రాత్రికి పూర్తవుతాయని రైల్వే అడిషనల్ డిఆర్ఎం రామ్ మెహర తెలిపారు. రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు పూర్తి అయినట్లయితే గుంటూరు- గుంతకల్ మధ్య రైళ్ల రాకపోకలకు మార్గం సుగమమవుతుందని అన్నారు.
కొట్టుకు పోయిన రైల్వే ట్రాక్... సరిచేస్తున్న యంత్రాంగం - ప్రకాశం జిల్లా తాజా వార్తలు
గిద్దలూరు నియోజకవర్గంలో వర్షం ధాటికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేశారు. శుక్రవారం రాత్రికి పనులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు.
కొట్టుకు పోయిన రైల్వే ట్రాక్... సరిచేస్తున్న యంత్రాంగం