ప్రకాశం జిల్లా మార్టూరు సమీపంలోని గ్రానైట్ క్వారీలో పనిచేస్తున్న కార్మికులు కంటైనర్ లారీలో మార్టూరు నుంచి ఉత్తర్‌ప్రదేశ్ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. గ్రానైట్ రాళ్లను రవాణా చేసే కంటైనర్ లారీలో 62 మంది కార్మికులు ఇరుక్కుని ప్రయాణం చేస్తున్నారు. ముందస్తు సమాచారంతో శింగరకొండ వద్ద కంటైనర్‌ను అడ్డుకున్న పోలీసులు... వివరాలు సేకరించారు. కార్మికుల అభ్యర్థన మేరకు అదే లారీలో ఎక్కించి స్వస్థలాలకు పంపించేశారు.
కంటైనర్‌లో 62 మంది కార్మికులు ప్రయాణం..! - వలస వెతలు
వలస కార్మికులు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాణాలను సహితం లెక్క చేయడం లేదు. ప్రకాశం జిల్లా మార్టూరు సమీపంలోని గ్రానైట్ క్వారీలో పని చేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 62 మంది కార్మికులు...కంటైనర్ లారీలో వెళ్లేందుకు సిద్ధపడ్డారు.
ప్రకాశం జిల్లాలో వలస వెతలు