ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పర్చూరు కోర్టులో ఘనంగా జాతీయ న్యాయ దినోత్సవం

By

Published : Nov 27, 2020, 12:19 PM IST

జాతీయ న్యాయ దినోత్సవాన్ని ప్రకాశం జిల్లా పర్చూరు కోర్టులో ఘనంగా నిర్వహించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మండల న్యాయాధికార సేవా సంస్థ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు.

National Justice Day celebrations
పర్చూరు కోర్టులో ఘనంగా జాతీయన్యాయదినోత్సవం

ప్రకాశం జిల్లా పర్చూరు కోర్టులో జాతీయ న్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సీనియర్ సివిల్ న్యాయమూర్తి, మండల న్యాయాధికార సేవా సంస్థ చైర్మన్ ఎం. కుముదిని పాల్గొన్నారు. సమస్య ఏదైనా చిరునామా మండల న్యాయాధికార సేవా సంస్థ అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కుముదిని అన్నారు. కరోనా సమయంలో పర్చూరు పారా లీగల్ వాలంటీర్లు... ఆదిపూడి, ఇంకొల్లు, యద్దనపూడి, పర్చూరు మండలాల్లోని వలస కూలీలకు, రేషన్ కార్డు లేని పేదలకు రేషన్ ఇప్పించటంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఈ సేవకు గుర్తుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. వెంకట జ్యోతీర్మయి పంపించిన ప్రశంసాపత్రాలను పారాలీగల్ వాలంటీర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి వి. నాగేశ్వరరావు నాయిక్, న్యాయవాదులు పాల్గొన్నారు.

ఇదీ చదవండీ...

ABOUT THE AUTHOR

...view details