ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులకు చిక్కిన అంతరాష్ట్ర దొంగలు - parchur police station

తాళాలు వేసి ఉన్న ఇళ్ళే లక్ష్యంగా దొంతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు... ప్రకాశం జిల్లా పోలీసులకు చిక్కారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు... వారి వద్ద నుంచి 6 లక్షల 76 వేల రూపాయలు విలువగల సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

By

Published : Aug 27, 2019, 8:26 AM IST

తాళాలు వేసి ఉన్న ఇళ్ళే లక్ష్యంగా దొంతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను ప్రకాశం జిల్లా పర్చూరు పోలీసులు అరెస్టు చేశారు. షేక్ యూసఫ్ బాషా, వాడపల్లి శ్రీను అనే వ్యక్తులు హైదరాబాద్​లోని ఎస్.ఆర్ నగర్​లో నివాసం ఉంటూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చీరాల డీఎస్పీ వై.జయరామ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లులొ అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిద్దరిని... పర్చూరు సీ.ఐ. ఆర్. రాంబాబు, ఎస్సై డి.రంగనాథ్ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిద్దరిని విచారించగా... గత ఏడాది ఇంకొల్లులో జరిగిన రెండు దొంగతనాలు తామే చేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు. అనంతరం వారి వద్ద నుండి 6లక్షల 76 వేల రూపాయలు విలవగల సొమ్మను స్వాదీనం చేసుకున్నామని... వారిని కోర్టుకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.

అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details