ప్రకాశం జిల్లా నాగులవరం గ్రామంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. సాలెపురుగు, సీతాకోకచిలక మధ్య పోటీ జరిగింది. గూడు కట్టడంలో ఎంత ప్రతిభ చూపుతుందో... వేటాడడంలోను అంతే కసి చూపిస్తుంది సాలె పురుగు. ఎంత పెద్ద కీటకమైనా గూడుకు తాకితే బందీ కావలసిందే. చల్లని గాలికి విహరిస్తున్న ఓ సీతాకోకచిలుక సాలెపురుగు గూటిలో చిక్కుకుంది. తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఇంతలో గిలగిలా కొట్టుకుంటున్న సీతాకోకచిలుకను చూసింది సాలె పురుగు. అంతే తనకు ఆహారం దొరికిందని లొట్టలేసుకుంటూ అమాంతం సీతాకోకచిలుకను బంధించింది.ఈ ఘటన చూపరులను కట్టిపడేస్తుంది.
'నా వలకు చిక్కావో... బయటకు పోవటం కష్టమే..!' - butterfly and spider fight news in prakasam district
నా వలలో చిక్కి ప్రాణాలతో బయటకు పోవటం ఎవరి వల్ల కాదంటోంది ఓ సాలె పురుగు. వేటాడే పులి పంజా నుంచి తప్పించుకోవచ్చు కానీ నా వల నుంచి తప్పించుకోవటం చాలా కష్టమని నిరూపించింది స్పైడర్. సరదాగా విహరిస్తున్న ఓ సీతాకోకచిలుక సాలె వలకు చిక్కి స్పైడర్కు ఆహారమైపోయింది. ఈ ఆసక్తికర సంఘటన ప్రకాశం జిల్లా నాగులవరం గ్రామంలో జరిగింది.
సాలె పురుగు సీతాకోకచిలు మధ్య ఆసక్తికర పోరాటం