ప్రకాశం జిల్లా ముండ్లమూరులో పెట్రోల్ బంకు వద్ద టిప్పర్ కు విద్యుత్ తీగలు తగిలి టిప్పర్ డ్రైవర్ కె అశోక్ (23) అక్కడికక్కడే మృతి చెందాడు. అతడిని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
ప్రమాదవశాత్తు 11 కేవీ విద్యుత్ లైన్ తీగలను తాకి టిప్పర్ కు.. విద్యుత్ ప్రసరించిన సందర్భంలో డ్రైవర్ అశోక్ కు విద్యుత్ షాక్ తగిలి కిందపడిపోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు.