ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నోటితో బాంబును పట్టుకున్న కుక్క.. అక్కడికక్కడే మృతి - Bomb in khambham news today

ఇంటి పెరట్లో నిల్వ ఉన్న నాటు బాంబు పేలిన ఘటనలో ఓ కుక్క అక్కడికక్కడే మరణించింది. నోటితో బాంబును పట్టుకున్న శునకం పేలుడు ధాటికి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది.

నోటితో బాంబును పట్టుకున్న కుక్క అక్కడికక్కడే మృతి
నోటితో బాంబును పట్టుకున్న కుక్క అక్కడికక్కడే మృతి

By

Published : Apr 13, 2021, 7:59 PM IST


ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్ద నాటు బాంబు కలకలం రేపింది. పంట పొలాల్లో అడవి పందుల కోసం ఉపయోగించే నాటుబాంబులను ఇంట్లోని పెరట్లో నిల్వ చేశారు. వాటిని వీధి కుక్క నోటితో పట్టుకోగా బాంబు ఒక్కసారిగా పేలి భీకర శబ్దం వచ్చింది.

ఉలిక్కిపాటు..

భయాందోళనకు గురైన చుట్టు పక్కవారంతా ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న కంభం ఎస్సై మాధవరావు హుటాహుటిన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం బాంబులను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సబ్ ఇన్​స్పెక్టర్​ తెలిపారు.

ఇవీ చూడండి : దేశ రక్షణకు మోదీ సర్కార్ 'హైవే స్కెచ్​' !

ABOUT THE AUTHOR

...view details