ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే! - కారు ప్రమాదం వీడియో వైరల్ వార్తలు

మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ కారు కాలువలోకి దుసుకెళ్లి బోల్తా పడిన ఘటన ప్రకాశం జిల్లా చీరాలలో జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి.

The car that crashed into the canal in praksham district video viral

By

Published : Nov 4, 2019, 10:59 AM IST

Updated : Nov 4, 2019, 12:51 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలో ఓ కారుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పర్చూరు నుంచి చీరాల వెళ్తున్న కారు.... లారీ స్టాండు సమీపంలోని వంతెన వద్దకు రాగానే.. అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. తెల్లవారుఝామున 5గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో కారు కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి.

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Last Updated : Nov 4, 2019, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details