ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనిగిరి పొగాకు బోర్డు సమీపంలో కారు దగ్ధం - కనిగిరిలో కారు దగ్ధం

ప్రకాశం జిల్లా కనిగిరిలో పొగాకు బోర్డు సమీపంలో కారు దగ్ధమైంది. ప్రొద్దుటూరుకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు పొగాకు బోర్డు వెనుక ఉన్న స్థలం చూసి తిరుగు ప్రయాణమయ్యారు. కారులోని సాంకేతిక కారణాల వల్ల ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో అప్రమత్తమైన డ్రైవర్​తో సహా కారులో ఉన్న నలుగురు కిందకు దిగారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు.

The car burned near the tobacco board at Kanigiri
దగ్ధమైన కారు

By

Published : Feb 15, 2020, 7:21 PM IST

కనిగిరిలో పొగాకు బోర్డు సమీపంలో కారు దగ్ధం

ABOUT THE AUTHOR

...view details