ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ఇసుక దర్శి గ్రామ పరిధిలోని వాగులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. సుమారు 45 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మృతదేహం కాలువలో పడి ఉందని పోలీసులకు సమాచారం అందంది.
ఘటనా స్థలానికి చేరుకున్న మార్టూరు పోలీసులు అతికష్టం మీద మృతదేహాన్ని బయటకు తీశారు. స్థానికంగా విచారణ చేపట్టాడు. వివరాలు లభించక పోవటంతో పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వాస్పత్రికి మృతదేహాన్ని తరలించారు.