ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మలపాడు గ్రామానికి చెందిన మదర్ వలి అనే వ్యక్తి నివాస స్థలం మంజూరు కాలేదని గ్రామ సచివాలయ భవనం పైకి ఎక్కాడు. అక్కడి నుంచి దూకుతానని బెదిరించాడు. అప్రమత్తమైన సచివాలయ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకుని మదర్ వలికి నచ్చజెప్పారు.
నివాస స్థలాలు జాబితాలో పేరు లేదని టవర్ ఎక్కాడు
రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్న నివాస స్థలాలు జాబితాలో తన పేరు లేదంటూ సంతమాగులూరు మండలంలో ఓ వ్యక్తి భవనం నుంచి దూకుతానని భయభ్రాంతులకు గురి చేశాడు. పోలీసులు చేరుకొని అతన్నితో మంతనాలు జరిపి శాంతింపజేశారు.
నివాస స్థలాలు జాబితాలో తన పేరు లేదని.. ఆత్మహత్యకు ప్రయత్నం
తాహసిల్దార్ వెంకటరామిరెడ్డి కలుగ చేసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్ కార్డు లేని వారి పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేవని.. అయినప్పటికీ అర్హులందరికీ నివాస స్థలాలు మంజూరుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇది చదవండి కరోనా రికవరీలో తెలుగు రాష్ట్రాలు భేష్