ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తమిళ బోట్లతో ఆంధ్రా మత్స్యకారులకు చిక్కు - latest news of thamilanadu boats in andhra

సముద్ర తీరంలో చేపల వేట నమ్ముకుని జీవనం సాగించే బతుకులు వాళ్లవి. కుటుంబమంతా శ్రమిస్తేగానీ ఆ పూట గడవదు. ఇలాంటి పరిస్థితుల్లో సరిహద్దు రాష్ట్రాల తీరు సమస్యగా మారింది.

తమిళబోట్లు ఆంధ్రా మత్సకారులకు సమస్య

By

Published : Nov 20, 2019, 12:09 PM IST

Updated : Nov 20, 2019, 1:09 PM IST

తమిళ బోట్లతో ఆంధ్రా మత్స్యకారులకు చిక్కు

సముద్ర తీరంలో చేపల వేటనే నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకార కుటుంబాలకు తమిళనాడు బోట్లతో సమస్య వచ్చిపడింది. నిబంధనలు అతిక్రమించి హైస్పీడ్ బోట్లతో నెల్లూరు, ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో వేటాడుతున్నారు. మత్స్య సంపద కొల్లగొడుతున్నారు. వేట లేక జీవనోపాధి కోల్పోతున్నామని జిల్లా మత్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్ర ప్రాంతంలో తమిళనాడు బోట్లు నిషేధించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్నవారు లేరు. ఇటీవల తమిళనాడు నాగపట్నానికి చెందిన హైస్పీడ్ మరబోటులో 9 మంది మత్స్యకారులు నెల్లూరు జిల్లాలోని పెదపట్టపుపాలెం వచ్చి వేట సాగించారు. ఇది గమనించిన స్థానిక జాలర్లు ఆ బోటు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 9మందిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల సమక్షంలో పంచాయితీ జరిగింది. తమిళనాడు బోటులు ఆంధ్రాకు రాకుండా చేస్తేనే బోటు అప్పగిస్తామన్నారు స్థానిక జాలర్లు. ఇరు వర్గాలతో మరోసారి చర్చించి సమస్య పరిష్కరిస్తామంటున్నారు పోలీసులు. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు ప్రకాశం జిల్లా మత్స్యకారులు.

Last Updated : Nov 20, 2019, 1:09 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details