ప్రకాశం జిల్లా కంభంలో కరోనా పరీక్షల కోసం సంజీవని వాహనం వచ్చింది. అయితే అందులో పరీక్ష చేసే కిట్లు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ బస్సులో సాంకేతిక సిబ్బంది వస్తుంటారు. వీరికి స్థానిక ప్రాథమిక వైద్య సిబ్బంది సహకారాన్ని అందిస్తుంటారు. అయితే వైద్య సిబ్బంది కిట్లు తీసుకురాకపోవడంతో సమస్య తలెత్తింది.
'సంజీవనిలో కిట్లు లేవు.. ప్రజలకు ఇక్కట్లు తప్పట్లేవు' - మదనగ్ ూాేూ కగూే
కరోనా పరీక్షల కోసం ప్రత్యేకంగా తయారీ చేసిన సంజీవని వాహనాలను గ్రామాలకు తరలిస్తున్నారు. ఇందులోని సిబ్బంది పరీక్షలకు సంబందించిన కిట్లు వైద్యుల ద్వారా తీసుకురావాలి. కానీ, సంజీవని బస్సు వచ్చినా.. కిట్లు తేకపోవడంతో ప్రజలు పరీక్షల కోసం ఎండలో బారులు తీరారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కంభంలో చోటు చేసుకుంది.
'సంజీవనిలో కీట్లు లేవు.. మాకు ఇక్కట్లు తప్పేవా లేదు'
పరీక్షలు నిర్వహించుకోడానికి జనం భౌతిక దూరం పాటించి వరుస కట్టినప్పటికీ పరీక్షలు నిర్వహించకపోవటంతో అసహనానికి గురయ్యారు. కిట్లు తీసుకువెళ్లాలని తమకు సమాచారం లేదని బస్సు సిబ్బంది పేర్కొన్నారు. మొత్తానికి సిబ్బంది సమన్వయలోపంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కరోనా పరీక్షల కోసం వచ్చినవారు నిరుత్సాహంగా వెనుదిరిగారు.
ఇదీ చదవండిప్రకాశం: శానిటైజర్ తాగిన ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య