రేపల్లె రైల్వేస్టేషన్‌లో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతుండటంతో పరామర్శించేందుకు హోంమంత్రి తానేటి వనిత, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఈనెల 2న వచ్చారు. మరో మంత్రి ఆదిమూలపు సురేష్‌తో కలిసి జీజీహెచ్‌కు వనిత బయలుదేరారు. ఈ సమయంలో హోంమంత్రి కాన్వాయ్‌ని రామ్‌నగర్ ఒకటో లైన్ సమీపంలో తెలుగు మహిళలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కాన్వాయ్ కొద్దిసేపు నిలిచిపోయింది. అధికార పార్టీ నాయకులు దీనిని తీవ్రంగా పరిగణించారు. ఘటనపై ఒంగోలు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. ఈ ఘటన జరిగిననాడే కేశన శేషమ్మ, కొక్కిలగడ్డ లక్ష్మిలను అరెస్టు చేసి రాత్రంతా స్టేషన్‌లోనే నిర్బంధించారు. తెల్లవారుజామున న్యాయస్థానంలో హాజరుపరచగా బెయిల్ మంజూరైంది. కాన్వాయ్ అడ్డగింతలో కుట్రకోణం ఉందని.. ప్రస్తుతం 17మందిని నిందితులుగా గుర్తించామని.. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు ఇటీవల ప్రకటించారు.
మరో పదిమంది తెలుగు మహిళలు అరెస్ట్.. - ఒంగోలులో హోంమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న మహిళలు అరెస్ట్
ఒంగోలులో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత కాన్వాయ్‌ను అడ్డగించిన కేసులో మరో పదిమంది తెలుగు మహిళా నాయకులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. రెండో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో వారిని ప్రవేశపెట్టగా... న్యాయమూర్తి గాయత్రి వారికి బెయిల్ మంజూరు చేశారు.
ఈ కేసులో శుక్రవారం రావిపాటి సీత, కె.కుసుమకుమారి, ఆర్ల వెంకటరత్నం, బోను దుర్గ, పి.దుర్గామల్లేశ్వరి, నాగేశ్వరమ్మ, నిడమనూరి పావని, గోన మేరీ రత్నకుమారి, షేక్ ఆరిఫా, చాపల దుర్గమ్మలను ఒకటో పట్టణ సీఐ కె.వి.సుభాషిణి శుక్రవారం అరెస్టు చేశారు. వారిని వైద్యపరీక్షల నిమిత్తం శుక్రవారం రాత్రి జీజీహెచ్‌కు తరలించారు. అనంతరం రెండో అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో వారిని ప్రవేశపెట్టగా... న్యాయమూర్తి గాయత్రి వారికి బెయిల్ మంజూరు చేశారు.
ఇదీ చదవండి: ముగ్గురు ఐఏఎస్‌లకు.. జైలుశిక్ష విధించిన హైకోర్టు