ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిందితులపై చర్యలు తీసుకోవాలని సెల్ టవర్ ఎక్కిన పూజారి - నిందితులపై చర్యలు తీసుకోవాలని సెల్ టవర్ ఎక్కిన పూజారి

ఆంజనేయస్వామి గుడి ప్రహరీగోడను పగలగొట్టిన వారిపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఆలయ పూజారి సెల్ టవర్​ను ఎక్కారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.

temple priest climbed the cell tower
సెల్ టవర్ ఎక్కిన పూజారి

By

Published : Dec 23, 2020, 6:09 PM IST

ప్రకాశం జిల్లా కురిచేడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో గల ఆంజనేయస్వామి దేవస్థానం ప్రహరీ గోడ నిర్మాణాన్ని స్థానికులు అడ్డుకొని... గోడను పగలగొట్టి ఇబ్బందులు పెడుతున్నారని అధికారులకు పూజారి రమణయ్య తెలిపారు. నిందితులపై చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ స్థానికంగా ఉన్న సెల్ టవర్​ ఎక్కారు. సమాచారం అందుకున్న పోలీసులు, మండల తహసీల్దార్ ఘటనాస్థలానికి చేరుకొని.. వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కిందకు దిగారు.

ABOUT THE AUTHOR

...view details